నిజామాబాద్ మార్కెట్లో పసుపు ధరకు రెక్కలు: క్వింటాల్ రూ. 16,500 రికార్డు నమోదు
అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్‌తో పెరిగిన కొనుగోళ్లు
నిజామాబాద్ బ్యూరో
ప్రచురణ: 26 అక్టోబర్ 2026, సాయంత్రం 4:14
సవరణ: 29 అక్టోబర్ 2026, సాయంత్రం 9:04
నిలుపుదల గడువు: ఇంకా 12 రోజులు
నిజామాబాద్: నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో పసుపు ధర చరిత్రలోనే అత్యధిక రికార్డును నమోదు చేసింది. నాణ్యమైన వేలు పసుపు క్వింటాలుకు రూ. 16,500 పలకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గత కొన్నేళ్లుగా పసుపు బోర్డు డిమాండ్‌తో పాటు విదేశీ ఎగుమతులు పెరగడం ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల రైతులు కూడా నిజామాబాద్ మార్కెట్‌కు పసుపును తరలిస్తున్నారు.
ట్యాగ్లు (Tags):
